శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలోని చేనేత చీరలు ప్రత్యేకంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. పటోళ్ల చీరలు, అజరాక్ అద్దకం చీరలు, పెన్ కలంకారీ చీరలు, కాశ్మీరీ చీరలు, బెంగాలీ కాటన్ , బందీని చీరలు, పోచంపల్లి, కోటం, బనారస్, చికెంకారి, జాంధానీ కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ మహిళలను ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గుజరాత్ నుండి విచ్చేసిన సిద్ధి దమల్ జానపద నృత్యం హనీఫ్ ముబ్బబుల్ మీయవ అలరించింది. పద్మ కళ్యాణ్ ఆధ్వర్యం లో శంభు కింకిణి డాన్స్ ఫెస్టివల్ రెండవ రోజు అస్సాం నుండి విచ్చేసిన డాక్టర్ మోనిష దేవి గోస్వామి తన శిష్య బృందం చే సత్రియా నృత్య ప్రదర్శన అలరించింది. దీప నారాయణన్ శశిధరన్ బృందం ఆధ్యాత్మ రామాయణ కీర్తన నృత్య రూపకాన్ని ప్రదర్శించి మెప్పించారు. పద్మ కళ్యాణ్ కళాకారులను సత్కరించారు.






