ఈసారి తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజ‌రైన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని బిజెపి కార్యాలయం నుండి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు కార్య‌క్ర‌మానికి త‌ర‌లివెళ్లారు. ఈ సంద‌ర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తోందని, ప్రజల సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు మోడీపై అపారమైన విశ్వాసంతో సభకు భారీగా తరలివచ్చారని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here