శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులను మండల విద్యాధికారి వెంకటయ్య, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకూడదని అన్నారు. త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని తెలియచేశారు. అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో TSEWIDC EE రాంకుమార్, DE కలిముద్దీన్, AE శ్యామ్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.