శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాధాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కథక్, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. బెంగళూరు నుండి విచ్చేసి న కథక్ కళాకారిణి అమ్రితా బనెర్జీ కథక్ నృత్య ప్రదర్శనలో శివ వందన, తాల్ ధంగార్, లపక్ ఝాపక్ – తుమ్రి అంశాలను ప్రదర్శించి మెప్పించారు. భరతనాట్య ప్రదర్శనలో వంశీ మాధవి బృందం గోపిక, అర్చిష్మాతే , గాయత్రీ , జాహ్నవి, నైనికా అంశాలను పుష్పాంజలి, అలరిపు, దశావతార,తీరు పల్లాండు, తక్కువేమి మనకు, పదం, తిల్లాన ప్రదర్శించి మెప్పించారు.