శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో రూ. 78 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, స్కూల్ ప్రిన్సిపాల్ బసవ లింగం, సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, నీరుడి గణేష్ ముదిరాజ్, బద్దం శాస్త్రి యాదవ్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లెల శ్రవణ్ యాదవ్, మల్లెల రాజు యాదవ్, కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, రక్తపు జంగం గౌడ్, తిరుపతి యాదవ్, కరీం లాలా, శ్రీనివాస్ చౌదరి, బుడుగు తిరుపతి రెడ్డి, మంగళరాపు తిరుపతి, సలీం, సాయి, రెహమాన్, బసవరాజు, వెంకటేష్, రవి శంకర్ నాయక్, పంతం గణపతి, రామకృష్ణ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.