కన్నెర్ర చేసి కార్మిక లోకం: సామెల్ కార్తీక్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత దేశం నరేంద్ర మోడీ పాలనలో ఆర్థికంగా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోనుంది. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అగ్రరాజ్యం అమెరికాతో ట్రేడ్ ఒప్పందాలు చేసుకున్న విధానం పలు అనుమానాలకు తావిస్తుంది. గతం కర్షకుల ఆగ్రహానికి గురైన బీజేపీ ఇప్పుడు కార్మిక లోకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్ ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పుష్కర కాల పాలనలో దేశ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారని, ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిందని అన్నారు. అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దేశం పారిశ్రామిక రంగం అభివృద్ధికి బాటలు వేసి, ఎనిమిది గంటల‌ పనికి చట్టబద్ధత కల్పించి కార్మికుల హక్కులను కాపాడింద‌న్నారు. బీజేపీ ప్రభుత్వం అనుకరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులకు అండగా నిలిచి వారి అభ్యున్నతి దిశగా అడుగులు వేస్తున్నామని సామల్ కార్తీక్ అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC, CPI, CPM, INTUC, LABOUR CELL, కర్షక సంఘాలు పాల్గొని ధర్నా అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

మియాపూర్‌లో..

దేశవ్యాప్త సమ్మె సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మియాపూర్ సర్కిల్ అంబేద్కర్ విగ్ర‌హం వద్ద నిరసన చేప‌ట్టారు. ఈ నిరసనలో భాగంగా కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న 29 చట్టాలుగా ఉన్నటువంటి వాటిని నాలుగు కోడ్‌లుగా చేసి కార్మికులకు నష్టదాయకంగా చేస్తుంది. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వ‌ల్ల‌ కార్మికులందరికీ తీవ్ర నష్టం జరుగుతుంది. దీనివలన సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం, యూనియన్ పెట్టుకోకపోవడం, ఎనిమిది గంటలుగా ఉన్న పని విధానాన్ని 12 గంటలు 13 గంటలు చేసే విధంగా ఉండటం యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయ‌ని, కనుక ఈ నాలుగు లేబర్ కోడ్‌ల‌ను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, వాటర్ బోర్డ్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ కార్మికులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, చందు యాదవ్, శీను, రాములు, శేరిలింగంపల్లి సిఐటియు జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ, జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటియు దానయ్య, నారాయణ, సుల్తానా బేగం, రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here