పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. గత ఏడాది ఉగాది కానుకగా సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం ఏడాది కాలం పూర్తిచేసుకున్న సందర్బంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ కాలనీలో వి.శ్రీనివాస్ అనే వ్య‌క్తి దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌ను త‌న ఇంటికి విందుకు ఆహ్వానించాడు. దీంతో వెంక‌టేష్ గౌడ్ ఆ వ్య‌క్తి ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో వండిన భోజ‌నాన్ని రుచి చూశారు. ఈ సందర్బంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ సన్న బియ్యం బువ్వతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. గత ఏడాది నుండి రేషన్ దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీని రేషన్ దుకాణాల ద్వారా నిరంతరాయంగా చేప‌డుతున్నార‌ని అన్నారు. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని అన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ పేదలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఇంటికి పిలిచి సన్నబియ్యంతో అన్నం వండి అందించిన శ్రీనివాస్, మాధవి దంపతులను వెంకటేష్ గౌడ్ శాలువాతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, CH.భాస్కర్, పోశెట్టిగౌడ్, ఖాజా, రవీందర్, వివేక్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here