- గోపినగర్లో ఉత్సాహంగా జిల్లా స్థాయి కుస్తీ పోటీలు…
- రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు 18 మంది ఎంపిక…
శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ నేతృత్వంలో జిల్లా స్థాయి అండర్ 20 పురుషులు, మహిళల కుస్తీ పోటీలను నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని తుల్జాభవాని వ్యాయామశాల ఆధ్వర్యంలో గోపినగర్ ప్రధాన కూడలిలో సోమవారం జరిగిన ఈ పోటీలలో జిల్లాలోని వివిధ వ్యాయామశాలల నుంచి దాదాపు 100 మంది క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

ఫ్రీ స్టైల్ వివిధ కేజీల విభాగంలో అభినయ్, శ్రీధర్, భరత్ బాబు, నాగేందర్, ఉమేష్, పీయూష్ సింగ్, అభిషేక్, జయ కిషన్ యాదవ్, సోమనాథ్ రెడ్డి, మహిళలు అపూర్వ, లక్ష్మి, శ్రీనిధి, రోమన్ గ్రీక్ స్టైల్ విభాగంలో వివిధ కేజీల పోటీల్లో శివకుమార్, ప్రణవ్ కుమార్, సాంబా ధనుంజయ్, సందీప్ చరణ్, సంపత్ కుమార్, దీప్ సింగ్, రవి కిరణ్, అభిరామ్ రెడ్డిలు పాల్గొని మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరందరూ ఏప్రిల్ 2వ తేదీ కామారెడ్డిలో జరగనున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు అర్హత సాధించారు.

విజేతలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పిసిసి ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి ఇన్చార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, బిఆర్ఎస్ శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజి కౌన్సిలర్ దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, మూల వెంకటేష్ గౌడ్, దుర్గం వీరేశం గౌడ్, విజయ్ కుమార్ రెడ్డి, కాటా నరసింహ గౌడ్, కొమరగౌని వెంకటేష్ గౌడ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, బెజగం కేశవులు, లీలానంద్ గౌడ్, మల్లేష్ ముదిరాజ్, గోపాల్ యాదవ్, కలివేముల వీరేశం గౌడ్, పుట్ట శ్రీకాంత్ గౌడ్, గఫూర్, నర్సింహా తదితరులు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కుస్తీ అంటే భారతీయ ప్రాచీన మల్ల యుద్ధమని, ఒలంపిక్స్ లోనూ ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. అలాంటి కుస్తీ వైపు యువత అడుగులు వేయడం అభినందనీయమని అన్నారు. లింగంపల్లిలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించిన తుల్జా భవాని వ్యాయామశాల నిర్వాహకులు లచ్చమొళ్ల పాండు గౌడ్, ఆయన కుమారులు అరవింద్ గౌడ్, మోహన్ గౌడ్, రోషన్ గౌడ్ లను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.యాదయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.పాండు, ఉపాధ్యక్షుడు హీరాలాల్, కార్యదర్శి భగవాన్ సింగ్, కుస్తీ ప్రముఖులు రాజు, శ్రీధర్, రాజ్ కుమార్, సుధాకర్, రమ్య, శ్రీనివాస్, విశ్వంభర్ సింగ్, నవీన్, ప్రకాష్ సింగ్, బస్తీవాసులు పాల్గొన్నారు.






