మంజీర పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవడం చాలా దురదృష్టకరం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం రోడ్డులో సత్యలక్ష్మి నగర్ కాలనీ వద్ద మంజీర మంచి నీటి పైప్ లైన్ అకస్మాత్తుగా పగిలిపోవడం వలన వెంటనే చేపట్టిన పైప్ లైన్ పునరుద్ధరణ పనులను జలమండలి అధికారులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మంజీర పైప్ లైన్ పగిలిపోయిన విషయం తెలియగానే సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింద‌ని, చాలా సంవత్సరాల క్రితం వేసిన పాత పైపులు అవడం వలన, వాటి జీవిత కాలం తగ్గడం వలన, కరెంట్ అన్, ఆఫ్ చేసే క్రమంలో ఆ సమయంలో గ్యాస్ వాయువు ఏర్పడి పగిలిపోవడం జరుగుతుంద‌ని, ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని తెలియచేశారు. మంజీర పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవడం చాలా దురదృష్టకరం అని, పైప్ లైన్ పగిలిపోవడం వ‌ల్ల‌ మంచినీటి సరఫరాలో ఇబ్బంది ఎదురైంద‌ని, జలమండలి, GHMC , ట్రాఫిక్ విభాగం అధికారులు సమన్వయం చేసుకొని పైప్ లైన్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టి, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృషి చేయాలని అన్నారు. ప‌నులలో వేగం పెంచి, నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here