కాన‌రి ది స్కూల్‌లో ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ – షేపింగ్ ది ఫ్యూచర్ సమ్మిట్ 2025

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కానరి ది స్కూల్ లో ‘ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ – షేపింగ్ ది ఫ్యూచర్ సమ్మిట్ 2025ను వినూత్న రీతిలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించడం ద్వారా కానరి ది స్కూల్ చరిత్ర సృష్టించింది. మరోక సారి BML ముంజాల్ యూనివర్సిటీ సహకారంతో విద్యలో అత్యంత ముఖ్యమైన అంశాలను అన్వేషించడానికి మొదటి సారిగా తల్లిదండ్రులు, కౌన్సెలర్‌లు, ప్రిన్సిపాల్‌లను మూడు పవర్-ప్యాక్డ్ స్లాట్‌లలో ఒకచోట చేర్చారు. BML ముంజాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్యామ్ మీనన్, ప్రొఫెసర్ సౌమ్యజిత్ భర్, డాక్టర్ కల్పిత భర్ పాల్, ప్రొఫెసర్ అనూప్ కుమార్ ధర్‌ ప్యానెలిస్ట్‌లుగా వ్యవహరిస్తూ ఈ సమావేశానికి హాజరైన వారందరిని ఆకర్షించే రీతిలో అద్భుతమైన సెషన్‌లను అందించారు.

ఈ సమ్మిట్ మూడు పవర్-ప్యాక్డ్ సెషన్‌లతో విద్య నిర్దిష్ట అంశాన్ని పరిష్కరించడానికి జాగ్రత్తగా రూపొందించబడింది. వేగంగా మారుతున్న ప్రపంచం కోసం ‘ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్’ ద్వారా సంక్లిష్ట సమస్యలపై లోతైన అవగాహనను పెంపొందించడానికి బహుళ విభాగాలను ఏకీకృతం చేయడం , ప్రాముఖ్యతను అన్వేషించడం ఎలాగో సూచించారు. మంచి జీవితం కొరకు పునరాలోచించడం – ‘దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం విద్య’ అంటే విద్యార్థుల శ్రేయస్సు, ఆనందం, దీర్ఘకాలిక విజయానికి ప్రాధాన్యతనిచ్చే విద్యకు సంబంధించిన వినూత్న విధానాలను ప్యానెలిస్ట్‌లు చర్చించారు. పోటీ ప్రపంచంలో కెరీర్‌లు, శ్రేయస్సు గురించి పునరాలోచించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ మార్కెట్ , ఉజ్వల భవితవ్యం, ఏ విధంగా విజయ పథాన్ని అధిరోహించగలం, అందరిలో సాంప్రదాయ భావనలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది అనే దానిపై దృష్టి సారించడం ఎలాగో వివరించారు.

ఈ సమ్మిట్‌కు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురించి ప్రిన్సిపల్ లిడియా క్రిస్టినా మాట్లాడుతూ హాజరైన వారి నుండి వచ్చిన అఖండ స్పందన త‌మ‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్యానెలిస్ట్‌లకు, మోడరేటర్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి, చైర్ పర్సన్ డాక్టర్ శ్వేతారెడ్డి ప్రోత్సాహంతో, హెడ్ సీనియర్ స్కూల్ డాక్టర్ ఇమ్మడి నవీన్ కుమార్ సమిష్టి కృషి వలన ఈ కార్యక్రమం విజయవంతమైనదని తెలిపారు. అడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం, పివైపి కోఆర్డినేటర్ అపర్ణ, ఎపివైపి కోఆర్డినేటర్ ముక్తా, ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here