విద్యార్థుల సమస్యలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగ‌దు: ఏఐఎస్ఎఫ్

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అఖిల భారత విద్యార్థి సమాఖ్య Aisf శేరిలింగంపల్లి మండల కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు చేరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు టి.రామ కృష్ణ, శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి కె. చందూ యాదవ్‌ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల అధ్యక్షుడు టి. నితీష్, కార్యదర్శి జె.ధర్మ తేజ ఆధ్వ‌ర్యంలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సమస్యలకు ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాటం చేస్తుంద‌న్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల‌ను బాగు చేయాల‌ని, కొత్త నిర్మాణం చేప‌ట్టాల‌ని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల‌ని అన్నారు. విద్యార్థులకు తాగడానికి మంచినీరు అందించాలి, క్లాస్ రూమ్ ల‌లో బెంచిలు, బోర్డులు, లైట్స్ , ఫ్యాన్స్ అంద‌జేయాల‌ని, విద్యార్థులకు చదువు చెప్పే ఉపాధ్యాయుల సంఖ్య‌ను పెంచాల‌ని, టాయిలెట్స్ బాగు చేసి కొత్తగా నిర్మించాల‌ని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల‌ని, ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెల‌గాటం ఆడొద్దని, విద్యార్థుల సమస్యలకు న్యాయం జరిగే వరకు ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం ఆగద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here