కేపీహెచ్‌బీ యాదవ సంఘం నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కేపీహెచ్‌బీ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కేపీహెచ్‌బీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంద‌న్నారు. యాద‌వుల‌కు స‌హాయం చేసేందుకు సంఘం అన్ని విధాలుగా స‌హ‌కారం అందిస్తుంద‌ని తెలిపారు. యాద‌వుల ఐక్య‌త కోసం ప్ర‌తి యాద‌వ నాయ‌కుడు కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేపీహెచ్బీ యాదవ‌ సంఘం అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య యాదవ్, ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, వార్డు మెంబర్ రమణ యాదవ్, శంకరయ్య యాదవ్, గిరి యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ హరికృష్ణ చారి, రాష్ట్ర కార్యదర్శి మారుతి ముదిరాజ్, సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు సతీష్ కుమార్ చారి, శేరిలింగంపల్లి కన్వీనర్ కొత్త మహేష్ ముదిరాజ్, యాదవ సంఘం, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here