భ‌వానిపురం కాల‌నీలో మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందాన‌గ‌ర్ భ‌వానిపురం కాల‌నీలో స్థానిక కాల‌నీ సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో ఆదివారం మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీల‌ను నిర్వ‌హించారు. ఈ పోటీల్లో కాల‌నీ మ‌హిళ‌లు ఉత్సాహంగా పాల్గొని అంగ‌రంగ వైభ‌వంగా రంగ‌వ‌ల్లుల‌ను తీర్చిదిద్దారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీ మ‌హిళ‌లు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో ముగ్గుల పోటీల‌ను నిర్వ‌హించుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ముగ్గుల‌ను వేయ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల్లో దాగి ఉన్న సృజ‌నాత్మ‌క‌త బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అన్నారు. నిత్యం ఒత్తిడితో స‌త‌మ‌తం అయ్యే మ‌హిళ‌ల‌కు ఈ పోటీలు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయ‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here