ఘనంగా శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్పలో శ్రీశ్రీశ్రీ సిద్దిరామేశ్వర స్వామి జయంతిని పురస్కరించుకుని స్థానిక సంఘ సభ్యులు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 858 సంవత్సరాల క్రితం సోలాపూర్ లో జన్మించిన శ్రీ సిద్ధి రామేశ్వర స్వామి ఆ రోజుల్లోనే కుల వ్యవస్థ ఉండకూడదని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సమానంగా ఉండాలనే భావనతో కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు.

స్వామివారు సూచించిన మంచి మార్గంలో వారి అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని సాటివారికి సహాయం చేసే విధంగా ఉంటూ ప్రతిఒక్కరూ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మెట్రో ఈవెనింగ్స్ తెలుగు దిన పత్రిక 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో దినపత్రికల పాత్ర కీలకమని జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ నిజాలను నిర్భయంగా వార్తలు రాసి రచన శైలిని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, సంతోష్, బసవయ్య, శేఖర్, భాగ్యలక్ష్మి, కళ్యాణి, బసవరాజ్, కనకప్ప, భరత్ గౌడ్, రేవంత్, భీమయ్య, రమేష్, రాజు ఎల్లప్ప, మహేష్, సునీల్, గిరిరాజ్, ఎల్లలింగ, తిమ్మప్ప, ఎల్లప్ప, రాజు, మహేష్, భీమయ్య, పరమయ్య, విజయ్, స్వామి, సురేష్, అంబన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here