శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): యువత తలచుకుంటే సాధించనిది ఏమీ ఉండదని, కాలనీ అభివృద్ధిలో యువత ముందుండి సహకరించాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. రెండో సారి కార్పొరేటర్ గా గెలుపొందిన సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీలో కృతజ్ఞత సభ ను ఏర్పాటు చేశారు. తన గెలుపులో భాగస్వామ్యం అయిన కాలనీ వాసులకు, యువతకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పారు.

కాలనీ వాసుల వినతి మేరకు కమ్యూనిటీ భవనం నిర్మాణానికి పాటు పడతానన్నారు. కాలనీలో యువత పాత్ర చాలా కీలకమని, కాలనీ అభివృద్ధికి యువత సహకారం ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సుదర్శన్‌నగర్ కాలనీ టీఆర్ఎస్ బస్తీ యువత అధ్యక్షుడిగా ఇ.రమేష్ ను, ఉపాధ్యక్షుడిగా ఎం. నిషాంత్, జనరల్ సెక్రటరీగా శెషాన్ గౌడ్, కోశాధికారిగా టి. కోటేశ్వర్ రావును కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నియమించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ఎస్. రాము, చారి, టీఆర్ఎస్ పార్టీ గోపీనగర్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నాయకులు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పట్లోళ్ల నర్సింహా, సాయి, యువకులు పాల్గొన్నారు.






