శేరిలింగంప‌ల్లిలో తెరాస బ‌లోపేతానికి కృషి చేయాలి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట్ డివిజన్ ప‌రిధిలోని యూత్ కాలనీకి చెందిన టీడీపీ మైనారిటీ మండల‌ ప్రెసిడెంట్ షేక్ నూర్ అహ్మద్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్బంగా నూర్ అహ్మ‌ద్‌కు గాంధీ తెరాస కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

తెరాస‌లో చేరిన షేక్ నూర్ అహ్మద్ కు పార్టీ కండువాను క‌ప్పుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

అనంత‌రం గాంధీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై స్వచ్చందంగా తెరాస పార్టీలోకి వస్తున్నారని అన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తను గౌరవిస్తామని తెలిపారు. అందరం కలిసి బంగారు తెలంగాణను సాధించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేయాల‌ని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమ‌వుదామని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తూ, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో అందరినీ కలుపుకొని సమన్వయంతో పని చేస్తూ పార్టీని పటిష్ట పరచాల‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here