శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఛట్ పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అత్యంత పవిత్రంగా కొలిచే గొప్ప పండుగ ఛట్ పూజ అని , బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, చండీగఢ్, గుజరాత్, గయ, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా కార్తీకమాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ అని అన్నారు. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారని, మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటని, భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగఢ సత్యనారాయణ, విష్ణు వర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, రాజేందర్, లక్ష్మణ్, సురేష్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, అనిల్, నగేష్, శ్రీనివాస్, పింటు, రాకేష్, అజయ్ , రాజీవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.






