శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా బేగంపేటలోని హోటల్ ద ప్లాజాలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితర శాసనసభ్యుల సమక్షంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో పంజాగుట్ట కార్పొరేటర్, కార్పొరేటర్లు బాబా ఫాసియుద్దీన్, సీఎన్ రెడ్డి, అల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి సమావేశంలో చర్చించుకున్నట్లు తెలిపారు. విద్యావంతుడు, యువతలో మంచి పేరు ఉన్న వ్యక్తి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నిలబెట్టే సత్తా ఉన్న నవీన్ యాదవ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.






