శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా శుక్రవారం భట్టు రాజు కే.బి. రాజుని ఆర్గనైజింగ్ సెక్రటరీగా అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ నియమించి నియమాక పత్రాన్ని అందజేశారు. బీసీ సంఘాలకు బీసీ మహిళ యూత్ ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కలిగినందుకు రాజు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యాధికార దిశగా పయనిస్తున్న బీసీ ఐక్యవేదిక ప్రతి అంశంలోనూ ముందుండి పని చేస్తానని కార్యవర్గానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ తన సందేశంలో కే. బి. రాజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యవర్గంలో అందరితోపాటు ఆయన కూడా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను దృష్టిలో పెట్టుకొని అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన బీసీ మహిళలకు జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. నిరుద్యోగులైన బీసీలకు ఆటో రిక్షాలు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ తమ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వాలని, బీసీలకు రిజర్వేషన్ ను పార్టీ పరంగా ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని అన్నారు. ఈనెల 24వ తేదీన గాంధీ భవన్ ఎదుట, బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా గాంధీగిరి గాంధీ పద్ధతిలో అహింసాయుతంగా రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి బీసీలు ఎస్సీ ఎస్టీ మహిళలు యువత ప్రతి ఒక్కరు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం సీనియర్ బీసీ నాయకులు జి రామచంద్రయ్య, కే. బి. రాజు పాల్గొన్నారు.





