శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి డివిజన్ కి చెందిన శ్రీ అయ్యప్ప ట్విన్ సిటీ చిప్పింగ్, గోవా యూనియన్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లం నాయుడు , శ్రీ అయ్యప్ప ట్విన్ సిటీ చిప్పింగ్, గోవా యూనియన్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ బైపోతు ఫల్గుణ రావు, జనరల్ సెక్రటరీ సివకల జోగరావు, వైస్ ప్రెసిడెంట్ సిరిపురం ఖగేశ్వర్ రావు, సభ్యులు తమిరి విష్ణు, కామరాజు, కమల హాసన్, వాసు, ఖగేశ్వర్ రావు, చిన్నారావు, రామకృష్ణ, భీమరావు, గణపతి, ఎల్లం నాయుడు, రాజు, దాలి నాయుడు, షణ్ముఖ రావు, మల్లేష్, గిరి, చిన్నారావు పాల్గొన్నారు.






