శేరిలింగంపల్లి, జనవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న చత్తీస్గఢ్ గాంధీ శిల్పబజార్ లో చత్తీస్గఢ్ కి చెందిన హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బస్తర్ మెటల్ క్రాఫ్ట్స్, గోండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, డ్రై ఫ్లవర్స్ , వెదురు తో తయారు చేసిన గృహోపకరణాలు, కొస చేనేత చీరలు, జ్యూట్ బాగ్స్, సిసలు క్రాఫ్ట్, బిద్రీ క్రాఫ్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే సందర్శకులు సైతం శిల్ప బజార్ లో సందడి చేస్తున్నారు.






