నంబ‌ర్ ప్లేట్లు స‌రిగ్గా లేని వాహ‌నాల‌పై ప్ర‌త్యేక డ్రైవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఆల్విన్ ఎక్స్ రోడ్డు వ‌ద్ద ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ నేతృత్వంలో ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నంబ‌ర్ ప్లేట్లు స‌రిగ్గా లేని, అస‌లు నంబ‌ర్ ప్లేట్లు లేని వాహ‌నాల‌ను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో డ్రైవ్‌లో భాగంగా మొత్తం 44 టూవీల‌ర్లు, 2 ఆటోలను తాత్కాలికంగా సీజ్ చేసి నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిమానా విధించామ‌ని సీఐ ప్ర‌శాంత్ తెలిపారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వాహ‌నాల‌ను న‌డిపించాలని, లేక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here