శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): తనపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను కార్పొరేటర్ గా గెలిపించిన గచ్చిబౌలి డివిజన్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, ప్రజల ఆదరాభిమానాలనులు ఎప్పటికీ మరువలేనని డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల బెల్లా విస్టా క్లబ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం. రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధిలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గత ఐదేళ్లుగా అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు గంగాధర్ రెడ్డి అని అన్నారు.

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం తాను కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకోసం నిరంతరం పని చేశానని, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పించడం కోసం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, మేయర్, ఎంపీ, సహకారం తో డివిజన్‌లో అవసరమైన నిధులు రప్పించి, శక్తివంచన లేకుండా అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. డివిజన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగినట్లు వివరించారు. మహిళలు, వృద్ధులు, యువత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఓపెన్ జిమ్‌లు, కమ్యూనిటీ హాళ్లు, అసోసియేషన్ భవనాలు ఏర్పాటు చేయడం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు.

నల్లగండ్ల, గోపన్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గోపన్‌పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యమవడం తన అదృష్టమని పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీల్లో భద్రత, పరిశుభ్రత, డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. తన ఐదేళ్ల కార్పొరేటర్ పదవీకాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగానని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశానని, దానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్దతు తనకు ఎల్లప్పుడూ లభించాయని అన్నారు.
ఇన్నాళ్లు తన వెంట నడిచిన పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాలనీ వాసులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా గచ్చిబౌలి డివిజన్‌ను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల ఆశీస్సులు, సహకారం ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని అపర్ణ సైబర్ జోన్, అపర్ణ సైబర్ కమ్యూన్, అపర్ణ సైబర్ లైఫ్, అపర్ణ సరోవర్, మంజీరా డైమండ్ టవర్స్, మై హోమ్ విహంగా, మై హోమ్ క్రిష్, హోనర్ అక్వాంటిస్, స్కైవుడ్, మంజీరా డైమండ్, ముప్పా, రామ్కీ కాస్మోస్, ఎల్ & టీ, లక్ష్మీ విహార్–2, సైబర్ ఎన్‌క్లేవ్, డిఫెన్స్ కాలనీ, అపర్ణ సైబర్ కౌంటీ, గ్రీన్ గ్రేస్, ది ఫౌంటెన్ హెడ్, ఏఎస్ అట్లాంటిక్, బ్లూమ్ ఫీల్డ్, జైన్స్ క్రీక్, ఐటీ హైట్స్, నిహారిక గేటెడ్ కమ్యూనిటీల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గుల్మోహర్ పార్క్, నేతాజీ నగర్, నల్లగండ్ల విలేజ్, నల్లగండ్ల హుడా కాలనీ, మంజీరా డైమండ్ హైట్స్, గోపనపల్లి, గోపనపల్లి తండా, కేశవ్ నగర్, గౌలిదొడ్డి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, మధురా నగర్, రాయదుర్గం, టెలికాం నగర్, జీపీఆర్ఏ క్వార్టర్స్ , సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





