శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని JP నగర్ కాలనీ సీనియర్ నాయకుడు DSRK ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ DSRK ప్రసాద్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం అని , క్రీడల వలన శారీరక శ్రమ తో పాటు మానసిక దృఢత్వం లభిస్తుంది అని , క్రీడలు మానసిక ఉల్లాసంను పెంపొందిస్తాయి అని , స్నేహ భావం పెంపొందుతుంది అని అన్నారు.






