తెరాస ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల సంపూర్ణ మ‌ద్ద‌తు

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
  • తెరాస తీర్థం పుచ్చుకున్న నాయకులు

వివేకానందనగర్/కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌జ‌ల నుంచి తెరాస పార్టీకి, ప్ర‌భుత్వానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ కి చెందిన వివిధ పార్టీల విద్యార్థి నాయకులు సుమారుగా 100 మంది వివేకానంద నగర్ డివిజన్ తెరాస సీనియర్ నాయకుడు నాయినేని చంద్రకాంత్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి తెరాస పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి వారిని గాంధీ సాదరంగా ఆహ్వానించారు.

తెరాస‌లో చేరిన వివేకానంద న‌గ‌ర్ డివిజ‌న్ యువ‌త‌కు పార్టీ కండువాలు క‌ప్పుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్ర‌జ‌లు స్వచందంగా తెరాస పార్టీలో చేరుతున్నార‌ని అన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తను గౌరవిస్తామని, అందరూ కలిసి బంగారు తెలంగాణను సాధించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి అండగా ఉండాల‌ని అన్నారు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల‌ను ప్రవేశపెట్టడం జరిగింద‌ని, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మిల ద్వారా పేదింటి ఆడపిల్లల‌కు రూ.1,00,116 ఇవ్వడం జరుగుతుందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన మంజీరా నీరు అందిస్తున్నామ‌ని అన్నారు.

తెరాస‌లో చేరిన వివేకానంద‌న‌గ‌ర్ డివిజ‌న్ యువ‌త‌తో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు, రైతులకు 24 గంట‌ల‌ ఉచిత విద్యుత్తు వంటి అనేక గొప్ప సంక్షేమ పథకాల‌ను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే ద‌క్కుతుంద‌ని అన్నారు. తెరాస పార్టీ లో చేరిన వారిలో విద్యార్థి నాయకులు కాండూరి నరేష్, చందు, రాంరెడ్డి, రాజీవ్, జానీ, శ్రీకాంత్, నర్సింహా, సతీష్, ప్రవీణ్, సాయి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు రావు కార్తీక్ రావు, అల్లం మహేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.

తెరాస‌లో చేరిన కొండాపూర్ యువ‌త‌…

తెరాస‌లో చేరిన కొండాపూర్ డివిజ‌న్ యువ‌త‌కు పార్టీ కండువాలు క‌ప్పుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

కొండాపూర్ డివిజన్ కి చెందిన యూత్ నాయకులు సుమారు 70 మంది కొండాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి తెరాస పార్టీ కండువాలు క‌ప్పి వారిని పార్టీలోకి గాంధీ సాదరంగా ఆహ్వానించారు. తెరాస పార్టీలో చేరిన వారిలో యూత్ నాయకులు వెంకటేశ్వర్లు (వి.వి), శ్రీకాంత్, సతీష్, రూఫుస్, శాంసన్, రఘు తదితరులు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయకులు బలరాం యాదవ్, జంగం గౌడ్, తిరుపతి యాదవ్, కృష్ణ సాగర్, వెంకటేష్, కమలాకర్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

తెరాస‌లో చేరిన కొండాపూర్ డివిజ‌న్ యువ‌తతో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here