- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో చందానగర్ డివిజన్ పరిధిలో ముంపుకు గురైన దీప్తి శ్రీ నగర్ లో జోనల్ కమీషనర్ రవి కిరణ్, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, GHMC అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ఈ సందర్భం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో ఎక్కడ సమస్య ఉన్నా తక్షణమే అధికారులతో కలిసి వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. నాలా విస్తరణ పనులలో భాగంగా మిగిలిపోయిన అసంపూర్తి పనులను వెంటనే చేపట్టాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.

లోతట్టు ప్రాంతాలు, నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సన్నద్ధం కావాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వరదలకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ చిన్నారెడ్డి, ఏసీపీ సంపత్, డాక్టర్ రవికుమార్, డీఈ రూప దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు వెంకటేశం ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, అక్బర్ ఖాన్, గురుచరణ్ దూబే, మల్లేష్, వెంకటేశ్వర్లు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





