శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): సోమవారం మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి. శశి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగానికి చెందిన ఏఎంసీ గిరి, ఏసీపీ రాణి, డీఈ (ఎస్‌డబ్ల్యూఎం) వశిధర్, ఏఎంఓహెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్‌ఎస్ శ్రీనివాస్, ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రశాంత్, ఎంటమాలజీ విభాగం నుంచి ఆర్. చిన్న, వెటర్నరీ విభాగం నుంచి టి. సంజయ్ రెడ్డి, యూబీడీ విభాగం నుంచి సమీర, యూసీడీ విభాగం నుంచి ఏ. విజయలక్ష్మి, ఎలక్ట్రికల్ విభాగం నుంచి శివ శంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను డిప్యూటీ కమిషనర్ డి. శశి రేఖ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ – 01, ఇంజినీరింగ్ – 01, రెవెన్యూ – 01మొత్తం ఫిర్యాదులు 03 వచ్చినట్లు తెలిపారు.






