జాగో భాగ్యనగర్–ఛలో బాలాపూర్ ధర్మ రక్షణ సభపై అసెంబ్లీ స్థాయి సమావేశం

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గణేష్ సేన ఆధ్వర్యంలో, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో ఈ నెల 24న బాలాపూర్‌లో నిర్వహించనున్న జాగో భాగ్యనగర్ – ఛలో బాలాపూర్ ధర్మ రక్షణ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ స్థాయి సమావేశం నిర్వ‌హించారు. దీప్తి శ్రీనగర్ పరిధిలోని ధర్మపురి క్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాఘవ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆనంద్ గుప్తా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలో అక్రమ చొరబాట్లపై చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఐక్యత అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాజీ కన్వీనర్ రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, మూల అనిల్ గౌడ్, మాణిక్ రావు, మహేష్ యాదవ్, డివిజన్ కన్వీనర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే రాబోయే సభకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవ సమితి పెద్దలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here