శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్, డి కె ఎన్‌క్లేవ్, సాయిరాం నగర్, న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు, కాలనీ వాసులు స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నగర్, డి కె ఎన్‌క్లేవ్, సాయిరాం నగర్, న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు నగర్, డి కె ఎన్‌క్లేవ్, సాయిరాం నగర్, న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను కాలనీల వారితో కలసి స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగిందని, డ్రైనేజ్ సమస్య పై అధికారులతో చర్చించి అవసరమైన చోట నూతనంగా రోడ్లు, డ్రైనేజ్ లైన్లను ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేశారు.

అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడం జరిగిందని, కాలనీలలో అవసరమున్న చోట వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని, వీధి దీపాలను సక్రమంగా వెలిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. అల్లూరి సీతారామరాజు నగర్, డి కె ఎన్‌క్లేవ్, సాయిరాం నగర్, న్యూ ప్రశాంత్ నగర్ కాలనీలలో మౌలికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎ ఈ సంతోష్, సీనియర్ నాయకుడు గంగాధర్, పలు శాఖల సంబంధిత అధికారులు, అల్లూరి సీతారామరాజు నగర్, డి కె ఎన్‌క్లేవ్, సాయిరాం నగర్, న్యూ ప్రశాంత్ నగర్ కాలనీల అధ్యక్షులు, అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





