STP లైన్ లో తలెత్తిన సమస్య పరిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్ కాలనీల మధ్య ఉన్న‌ STP లైన్ లో తలెత్తిన సమస్య పరిష్కారానికి చేపడుతున్న మరమ్మత్తు పునరుద్ధరణ పనులను జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ STP లైన్ లో తలెత్తిన సమస్య ను సూపర్ సక్కర్ యంత్రం ద్వారా పనులు చేపడుతున్నాం అని అన్నారు. STP లైన్ లో పేరుకుపోయిన చెత్త చెదారంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. STP లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన, కుచించుకోపోవడం వలన కాలనీలో మురుగు సమస్య తీవ్రమైంని, STP ఔట్ లెట్ ను సరి చేసి డ్రైనేజి సమస్య ను త్వరితగతిన పరిష్కరిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ శిరీష, వర్క్ ఇన్స్పెక్టర్ కిష్టప్ప, నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here