శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్ కాలనీ కి చెందిన చెన్నూరి నవీన్ రెడ్డి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.2,80,000 ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఠల్, గోపాల్, లింగం , సత్యనారాయణ, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.






