శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నేతాజీనగర్ కాలనీ ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవేంద్ర శర్మ, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ కు హిమాలయ తపస్వి శ్రీశ్రీ సిద్దేశ్వర యోగి మహారాజ్ మహాకుంభ మేళాకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభ మేళాకు ఆహ్వానం లభించడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సులు తమపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మహా కుంభ మేళాకు వెళ్లాలనుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అందుకు గాను ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవేంద్ర శర్మను +918096824549 అనే ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2025/01/10b-1024x473.jpeg)