శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్ నందినగర్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లిలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని పరిస్థితులను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా రవీందర్ యాదవ్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం అని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని వివరించారు. ఈ సందర్బంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కేటీఆర్ మంత్రిగా ఉన్నపుడు జరిగిన అభివృద్ధి తప్పితే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదన్నారు. కనీసం హైదరాబాద్ జిల్లాకు మంత్రి కూడా లేడు అన్నారు. పేదల కోసం పని చేసిన పార్టీ బీ ఆర్ ఎస్ మాత్రమే అని, కమిషన్ ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారు అని ఆరోపించారు. కెసిఆర్ పై కుట్ర పూరితంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహారిస్తుంది అని మండిపడ్డారు. తెలంగాణ కోసం నిరంతరం శ్రమించన నేత కెసిఆర్ అని కొనియాడారు. రానుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.






