రాజ్యం మనది – రాజ్యాధికారం మనది: బీసీలకు పిలుపునిచ్చిన బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 4 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): బీసీ యుద్ధభేరి బహిరంగ సభను వరంగల్ జిల్లా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించారు. ఈ స‌భ‌కి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం మృత్తిదాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు సౌధ భూమన్న యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలందరూ ఏకం కావాలి అని అన్నారు. రాజ్యాధికారం దిశగా బీసీలందరూ సమైక్యంగా నడవాలని అన్నారు. అధిక జనాభా ఉన్న బీసీలు రాజకీయ రంగంలో ముందుకు సాగాలని అన్నారు. బీసీలను చిన్న చూస్తున్న అగ్రవర్గాలకు బుద్ధి చెప్పాలని, బీసీ లందరూ ఏకమై రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అందెల కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు బోయిని తిరుపతి యాదవ్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు పాయవేనికి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here