తెలంగాణ రాష్ట్రానికి దేశ బడ్జెట్‌లో అన్యాయం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్రానికి దేశ బడ్జెట్‌లో అన్యాయం జ‌రిగింద‌ని శేరిలింగంప‌ల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ట్యాంక్ బ్యాండ్ పై ఉన్న అంబేత్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, బొంతు శ్రీదేవి, నియోజకవర్గ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి దేశ బడ్జెట్‌లో కేంద్రం తీవ్ర‌ అన్యాయం చేసింద‌న్నారు.

తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్రంపై ప్ర‌జ‌లు ఆగ్రహంతో ఉన్నార‌న్నారు. బీజేపీ ఇందుకు త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌న్నారు. కేవ‌లం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల‌కే కేంద్రం నిధులు ఇచ్చింద‌ని, కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపుతుండ‌డం దారుణ‌మ‌న్నారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here