మేడ్చల్ (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుత్ రంగానికి చెందిన ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్-1829 సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన నగరంలోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు యూనియన్ నాయకులు మేడ్చల్ సర్కిల్‌లో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీలో యూనియన్ నాయకులు ప్రశాంత్, ఓబులేష్, శేఖర్ రెడ్డి, కుమార్, శ్రీకాంత్, సతీష్, రవీందర్, తిరుపతి, ప్రసాద్, అనిల్ కుమార్, నందు, కార్తీక్, దశరథ్ పాల్గొన్నారు.
