శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణి వంటి పథకాల్లో భాగంగా ఈ నెల 16 నుండి 20 వరకు అధికారుల బృందం పర్యటించి అర్హులను గుర్తించే ప్రక్రియ మొదలైందని,ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హుల ఎంపిక జరిగే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోడం జరుగుతుందని, ప్రతి అర్హుడైన పేదవాడికి పథకం అందే విధంగా అధికారులు కృషి చేయాలని ఆశించారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే పలు హామీలను రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. పేదవాడి కలలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని, వారి అభ్యున్నతికి పాటుపడే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
