స‌ర్వేలో స‌రైన వివ‌రాల‌ను ఇవ్వాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీలో జరుగుతున్న సర్వే కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని , ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందేలా అధికారులు కృషి చేయాలని అన్నారు.

ప్ర‌జ‌ల‌ను అడిగి వివ‌రాల‌ను తెలుసుకుంటున్న PAC చైర్మన్ గాంధీ

నిజమైన లబ్ధిదారులందరికి న్యాయం జరుగుతుందని, సర్వే కోసం వచ్చిన‌ అధికారుల బృందానికి వాస్తవాలు చెబుతూ అన్ని వివరాలను అందించాలని, తప్పుడు సమాచారం ఇవ్వకూడదని , ఈ నెల 16 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు అధికారుల బృందాలు పర్యటించి అర్హులను గుర్తిస్తాయి అన్నారు. ఈ చక్కటి సదవకాశం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు . ఈ కార్యక్రమంలో అధికారులు ఎ.ఎం.సి కె.శ్రీనివాస్, ఎఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సి.ఓ ముస్తఫా , నాయకులు పాండుగౌడ్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, రవీందర్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here