శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న మంజీర పైప్ లైన్ పనులను మంజూరు చేయాలని,హాఫీజ్ పెట్ ఫ్లైఓవర్ నుంచి హుడా కాలనీ వరకు మంజీర రోడ్డులో చేపట్టిన సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, మున్సిపల్ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దిశనిర్దేశంలో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని,మంజీర పైప్ లైన్ పనులతో ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా యుద్ధ ప్రాతిపదికన పనులుచేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి,రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వీరేందర్ గౌడ్,జనరల్ సెక్రటరీ కృష్ణ ముదిరాజ్,కాలనీ సభ్యులు నారాయణ రావు,కృష్ణ మూర్తి,ప్రసాద్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
