శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణ, చందు యాదవ్ హాజరై మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల శ్రమకు తగ్గిన ఫలితం లేదని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మున్సిపల్ కార్మికులకు రూ.26వేలు ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మోసం మోసం చేసిందని ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి మున్సిపల్ కార్మికుడికి ఇవ్వాలని, కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికులు చేస్తున్న శ్రమకు తగిన విధంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సంవత్సరానికి 15 రోజుల క్యాజువల్ లీవులను మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని, జాతీయ పండుగలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ కొమ్ము పరమేష్, అసిస్టెంట్ సెక్రటరీ జై శ్రీనివాస్, కొండలయ్య, మహేందర్, అంజి, భిక్షపతి, మధు, బాలకృష్ణ, మొగులమ్మ, ఏకలవ్య, లావణ్య, లత, జయమ్మ, బుజ్జమ్మ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖకి వినతి పత్రం అందజేశారు.






