సార్వ‌త్రిక స‌మ్మెను జ‌య‌ప్ర‌దం చేయాలి: కొంగరి కృష్ణ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి పిఎస్సి డాక్టర్ కి సిఐటియు మండల కార్యదర్శి కొంగరి కృష్ణ సమ్మె నోటీసు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 29 కార్మిక చట్టాల‌ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడులను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21 ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని, పనికి గ్యారెంటీ కల్పిస్తూ MGNREGA చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేయడం జరుగుతుంద‌న్నారు.

ఆశ వర్కర్లను చచ్చేంత సేవకులుగా కాకుండా రెగ్యులర్ వర్కర్ కూడా గుర్తించాలి, 45, 46 ఇండియన్ లేబర్ సిఫార్సులను అమలు చేయాలని, స్క్రీన్ కార్మికుల కోసం పే కమిషన్‌ను నిర్మించాలని, ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, రూ.10వేల పెన్షన్ చెల్లించాలని, ఆశ వర్కర్లు అందరినీ పర్మనెంట్ చేయాలని, వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కల్పించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు నీరజ‌, వనజ, సువర్ణ, ఊర్మిళ‌, జయలక్ష్మి, కృష్ణకుమారి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here