శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ గౌతమి నగర్ లో మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని బీజేవైఎం స్టేట్ వైస్ ప్రి కాంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె గౌతమీ నగర్ లో నెలకొన్న సమస్యలపై బుధవారం జీహెచ్ఎంసీ మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సింధు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. దోమల బెడద, అధ్వాన్నంగా మారిన రహదారులు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీ వంటి సమస్యలు నెలకొన్నాయని, వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని అన్నారు.






