విద్యార్థుల చేతుల్లోనే దేశ భ‌విష్య‌త్తు: మారబోయిన రవి యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బాలల దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపీనగర్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల, నెహ్రూనగర్ ఉర్దూ స్కూల్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, MRY ఫౌండేషన్ ఫౌండర్ మారబోయిన రవి యాదవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. రవి యాదవ్ విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పెన్‌లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసి వారితో సంభాషించారు. ఈ సంద‌ర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంత బాగా చ‌దివితే అంత మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్నారు. చ‌దువుల‌తోపాటు క్రీడ‌లు కూడా అవ‌స‌ర‌మే అని అన్నారు. క్రీడ‌ల వ‌ల్ల చిన్నారుల్లో క్రమ శిక్ష‌ణ అల‌వ‌డుతుంద‌ని, ధైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతాయ‌ని అన్నారు. నేటి బాలలే రేప‌టి పౌరులు అని, రాష్ట్ర‌, దేశ భ‌విష్య‌త్తు చిన్నారుల చేతుల్లోనే ఉంద‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కె.ఎన్. రాములు, మల్లేశ్ ముదిరాజ్, వెంకటాచారి, స్వామినాథ్, వెంకట్ రెడ్డి, గద్దం శ్రీనివాస్, గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, మున్నా, శంకర్, రాజు గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, స్వామి ముదిరాజ్, శివాజీ, వెంకట్, రాంబాబు, ప్రేమ్, రాజు చారి, జంగయ్య, బాలరాజ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, శశికళ, దివ్య, నిరూప, అనిత, కే.రాజేశ్వరి, పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయ సహచరులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here