శ్రీ‌రాంసాగ‌ర్ రెండో ద‌శ కాల‌వ‌కు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువ‌కు నామకరణం చేయాలని సూర్యాపేట జిల్లాకు బి.ఎన్.రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 19న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఎంసీపీఐ యూ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ముజఫర్ అహ్మద్నగర్ లోని యం.సి.పి.ఐ.(యు) కార్యాలయం ఎదుట‌ కరపత్రం విడుదల చేశారు. అనంతరం ఎం సిపిఐ(యు) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సుధాకర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో సాగునీరు, తాగునీరు సమస్య జఠిలంగా ఉందని ప్రజలు నిత్యం కరువుతో ఆకలి చావులతో అల్లాడుతున్న తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రాంతాలతోపాటు ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎగువ ప్రాంతాలకు శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువ ద్వారా లక్షలాది ఎకరాలు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1996 సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి ఆయా పనులు పూర్తి చేసేందుకు అనేక పోరాటాలు చేసిన బి.ఎన్.రెడ్డి పేరును శ్రీరామ్ సాగర్ రెండవ దశకు నామకరణం చేయాలని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఇటీవల సూర్యాపేట జిల్లాకు చెందిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరును శ్రీరామ్ సాగర్ రెండవ దశ కాలువకు నామకర‌ణం చేస్తామ‌ని ఆయన సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం శోచనీయమని అన్నారు. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ఈ జిల్లాకు రైతాంగం పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన బి.ఎన్.రెడ్డి పేరును పెట్టాలని చెప్పాడని, అది మరిచిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని అనడం సరైంది కాదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి బి.యన్ రెడ్డి పేరును చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచే విధంగా ఆయన పోరాటం ఎప్పటికీ గుర్తుండే విధంగా ఆయన పేరును సూర్యాపేట జిల్లాకు, శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువ‌కు నామకరణం చేయాలని అన్నారు .

ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు వి.తుకారం నాయక్ , రాష్ట్ర కమిటీ సభ్యుడు తుడుంఅనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు కర్ర దానయ్య, డి. మధుసూదన్, బి. విమల రంగస్వామి, డివిజన్ కమిటీ సభ్యులు శంకర్ , శివాని, సుల్తానా బేగం, లలిత, ఇసాక్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here