ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు.. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా వేడుకల‌ను అంగరంగ వైభవంగా విద్యార్థులచే నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రై బాలలు ఉపాధ్యాయులుగా వేషధారణలో విద్యార్థులకు చదువును భోదించిన విధానాన్ని స్వయంగా పాఠశాలలో గదులలో కూర్చుని వీక్షించారు. అనంతరం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం పాపిరెడ్డి నగర్ లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మదర్ సేవా సమితి చైర్మ‌న్ బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని భారత స్వాతంత్య్ర‌ ఉద్యమ నాయకుడు, భారతదేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మదర్ సేవా సమితి 20వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 14న మనం బాలల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. నవంబర్ 14న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం, పిల్లలపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమతో ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా ప్రకటించారని పేర్కొన్నారు. నెహ్రూ పిల్లలే దేశ భవిష్యత్తు అన్నారు అందుకే మనం బాగా చదవాల‌ని, మంచి లక్ష్యాలు పెట్టుకోవాల‌ని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా మంచి విద్య, మంచి విలువలు, మంచి ఆచరణతో ముందుకు సాగుదామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మదర్ సేవా సమితి ఛైర్మెన్ కొండల్ రెడ్డి, ZPHS శేరిలింగంపల్లి ప్రధానోపాధ్యాయుడు సుభాష్ చంద్రా రెడ్డి, పాపిరెడ్డి నగర్ ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయుడు భాస్కర్, ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, వీరేశం, శ్రీనివాసలు, సుమలత, విమల కుమారి, స్థానిక నాయకులు ప్రభాకర్ రెడ్డి, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, కే రమేష్, కుమార్, ప్రవీణ్, దామోదర్, నర్సింహా, రాజు, మల్కయ్య, నర్సింహా, నాందేవ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here