శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ఫుడ్ ప్లానెట్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి, నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, MBC చైర్మన్ జేరిపేటి జైపాల్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, పుష్ప నగేష్ యాదవ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్, మహమ్మద్ బేగ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అన్వర్ షరీఫ్, అక్బర్ ఖాన్, శ్రీనివాస్ రాజు, సందీప్ రెడ్డి, అంజద్ పాషా, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
