శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): జనవరి 10,11,12 తేదీలలో పుదుచ్చేరి, పాండిచ్చేరి లో జరిగిన జాతీయ సౌత్ జోన్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో అండర్ -14 పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిన మియాపూర్ కు చెందిన కృష్ణ కిషోర్, పొన్నకంటి దస్తగిరి, కవిత దంపతుల కుమారుడికి ఎంసిపిఐ (యు ) పార్టీ ఆధ్వర్యంలో తాండ్ర రామచంద్ర భవన్ ఎంఏనగర్ లో ప్రజా సంఘాల నాయకులు కలిసి ఘనంగా సన్మానం చేసి, తమ సహాయం ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, యం సీపీఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఎ ఐ ఎఫ్ డి డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అంగడి పుష్ప, ఎ ఐ సి టీ యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్ర దానయ్య, ఆకుల రమేష్ శివాని, ఎ ఐ ఎఫ్ డి వై నాయకులు , యం డి సుల్తానా బేగం, విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, అరుణ్, రాజేంద్ర, వంశి తదితరులు పాల్గొన్నారు.
