తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల నాయకుల సమావేశం

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కస్తూరి గోపాలకృష్ణ జై బిసి జాతీయ అధ్యక్షుడు, చైర్మన్ ఆధ్వర్యంలో కొండాపూర్ బీసీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బీసీ తెలంగాణ రాష్ట్ర సంఘాల, ముఖ్య నాయకుల సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సేవాదళ్ అధ్యక్షుడు ఒంగూరు శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అడ్వకేట్ రమేష్ యాదవ్ , తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, శేరి లింగంపల్లి బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ టీఎన్జీవోస్ కాలనీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు మధుకర్ చారి, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి జంగం గౌడ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు నీలం లక్ష్మీనారాయణ ముదిరాజ్, శ్రీనివాస్, ప్రభాకర్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు.

స‌మావేశంలో పాల్గొన్న బీసీ నాయ‌కులు

ఈ సంద‌ర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో బీసీ చైతన్య రథయాత్ర చేపట్టడం జరుగుతుందని మొదటగా శేరిలింగంపల్లి నియోజక వర్గంలో తిరిగి ఆ తర్వాత బాధ్యతగా పది జిల్లాలలో చుట్టివచ్చి హైదరాబాద్ జిల్లా సహా మిగతా అన్ని జిల్లాలలో బీసీల రథయాత్రను చేపట్టి బీసీలను చైతన్యపరిచి ఏకం చేసి రాజ్యాధికార దిశగా తీసుకెళ్దామని అన్నారు. ఈ విషయంలో మేధావులు పెద్దలు బీసీ నాయకులు అందరూ సహకరించి బీసీ రథయాత్రను విజయవంతం చేయాలని బీసీలకు పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here