శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీలో మంజీర నీటిలో డ్రైనేజ్ కలిసి వస్తుందని కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారనే సమాచారం మేరకు,జలమండలి సిబ్బందితో కలసి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించి పనులను వెంటనే మొదలుపెట్టి సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ మంజీర నీటిలో డ్రైనేజ్ కలిసి వస్తుందని, కాలనీ వాసుల ఇబ్బంది పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఎమ్మెల్యే గాంధీ సహకారంతో కొత్త లైన్ వేయడానికి అంచనాలు తీసుకోవాలని చెప్పారు. ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి DGM శ్రీనివాస రాజు, మేనేజర్ విలియమ్స్ ప్రకాష్, డ్రైనేజ్ సూపర్వైజర్ నరేంద్ర, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






