శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను భారాస సీనియర్ లీడర్, శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్ కలిశారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. రవీందర్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేదల కోసం రవీందర్ యాదవ్ చేస్తున్న కృషిని జగన్ కొనియాడారు. తెలంగాణ సోషియో కల్చరల్ అకాడమీ ఛైర్మన్ గా రవీందర్ యాదవ్ పేదలు, అనాధలు, స్కూల్ విద్యార్థులకు తన వంతు సాయం చేయడమే కాకుండా విపత్తుల సమయంలో స్పందిస్తున్న తీరుపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. మానవతా ధృక్పధంతో తాను ఉన్నానని రవీందర్ యాదవ్ ముందు ఉండటం గర్వించదగ్గ పరిణామం అన్నారు. సోషల్ మీడియాలో తాను సైతం చూశానని వైఎస్ జగన్ తెలిపారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ రవీందర్ యాదవ్ తో మంచి భవిష్యత్ ఉందని, రానున్న రోజుల్లో కీలక అవకాశాలు ఉంటాయని సూచించారు. అనంతరం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్ధిన ఘనత భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేనని పేర్కొన్నారు.